Monday, December 23, 2024

2 వేలకు దిగొచ్చిన కరోనా కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

India added 2022 new coronavirus infections

న్యూఢిల్లీ : ఆదివారం 2.94 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, 2022 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఆదివారం 2,099 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా, రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు 14,832 (0.03 శాతం)కు దిగొచ్చాయి. ఇక నిన్న 46 మంది మరణించగా, ఇప్పటివరకు 5,24,459 మంది కరోనాకు బలయ్యారు. దేశ వ్యాప్తంగా ఆదివారం 8.81 లక్షల మంది టీకా తీసుకోగా, మొత్తంగా 192 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News