- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో గత మూడ్రోజుల్లో లక్ష కరోనా కసులు నమోదయ్యాయి. శనివారం దేశంలో కొత్తగా 40,953 కరోనా కేసులు, 188 మరణాలు సంభవించాయి. గతేడాది నవంబర్ తర్వాత ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. దేశంలోని 8 రాష్ట్రాల్లో కోవిడ్ ఉద్ధృతి కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 2,88,394 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ లోనే 76.22శాతం యాక్టివ్ కేసులున్నాయి. అటు మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 62శాతం యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు.
- Advertisement -