Monday, November 25, 2024

9 గంటల్లో 2 కోట్లకు పైగా డోసుల పంపిణీ

- Advertisement -
India administers 20 mn vaccine doses
ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా వ్యాక్సినేషన్‌లో రికార్డు
- Advertisement -

న్యూఢిల్లీ: కొవిడ్ టీకా పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 9 గంటల్లోనే రెండు కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం భారీ ఎత్తున కొవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని, అదే మోడీకిచ్చే అసలైన కానుక అవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఉదయంనుంచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తుండగా సాయంత్రం 5.27 గంటల సమయానికి డోసుల పంపిణీ 2,03,68,343కు చేరుకున్నట్లు కొవిన్ డేటావెల్లడించింది. రాత్రివరకు 2.5 కోట్లకు పైగా టీకాలను పంపిణీ చేయవచ్చనిఅధికారులు అంచనా వేస్తున్నారు.

కాగా ఒక రోజులోనే 2 కోట్లకు పైగా టీకాలను పంపిణీ చేయడంతో భారత్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 9 గంటల సమయంలోనే 2 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేయడం విశేషం. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఒక రోజులో కోటికి పైగా టీకాలను పంపిణీ చేయడం ఇది నాలుగో సారి. కాగా మధ్యాహ్నం 1.30 సమయానికే టీకాల పంపిణీ కోటి డోసులను దాటిందని, ఇప్పటివరకు ఇదే అత్యంత వేగంగా జరిగిన టీకాల పంపిణీ అని మన్‌సుఖ్ మాండవీయ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 79 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. వచ్చే నెల నాటికి 100 కోట్ల డోసులను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News