Thursday, January 23, 2025

వ్యవసాయ ఎగుమతుల తిరోగమనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ పాలనలో వ్యవసాయ వాణిజ్య మిగులు, ఎగుమతులు తిరోగమనంలో ప యనిస్తున్నాయి. 2013-14లో భారతదేశ వ్యవసాయ వాణిజ్య మిగులు 27,722.72 మిలియన్ల డాల ర్లు ఉండగా, ఇది డిసెంబర్ 2022లో 11,227.28 మిలియన్ల డాలర్లకు తగ్గింది. మోడీ పాలనలో వాణిజ్య మిగులు తగ్గుముఖం పట్టిందని, ఎగుమతులు త గ్గుతున్నాయని వాణిజ్య డేటా స్పష్టం చేస్తోంది. వాణి జ్య మిగులు అనేది దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతను సూ చిస్తోంది. ఇది దేశంలో ఆర్థిక, ఉపాధి వృద్ధిని తెలుపుతోంది. విదేశీ మార్కెట్లలో దేశీయ కరెన్సీ విలువను ప్రభావితం చేసే ఉత్పత్తి ధరలు, వడ్డీ రేట్లు పెరగడాని కి వాణిజ్య మిగులు దారితీస్తోంది.

ఈనేపథ్యంలో వా ణిజ్య మిగులు తగ్గుముఖం పడితే రైతుల ఆదాయం రెట్టింపు అవడం అసాధ్యమనే చెప్పాలి. దేశ వ్యవసా యం ఎగుమతులు 201314లో రూ. 2,62,778 కోట్ల నుంచి 201516 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,13,555 కోట్లకు తగ్గాయి. దాదాపు 18శాతం క్షీ ణించాయి. దేశం మొత్తం ఎగుమతులు 201314 లో 13.79 ఉండగా 12.46 శాతం తగ్గాయి. భారత వ్యవసాయ ఎగుమతుల్లో టా ప్15 ఎగుమతి వస్తువులను పరిశీలిస్తే సముద్ర ఉ త్పత్తులు, మాంసం, రైస్, సుగంధ ద్రవ్యాలు, ముడిపత్తి, చక్కెర, జీడిపప్పు, తాజా కూరగాయలు, ఆము దం, పొగాకు, వేరుశనగ, తాజా పండ్లు ఉన్నాయి. అ దేవిధంగా దిగుమతులు 201314లో రూ.85,727కోట్లు ఉండగా 201516లో రూ. 1,39,933కోట్లకు పెరిగింది. సుమారు 63శాతం ది గుమతులు పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News