Monday, December 23, 2024

భారత్ 46 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు 31.2 ఓవర్లలో 46 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలింగ్ ధాటికి భారత బ్యాట్స్ మెన్లు విలవిలలాడిపోయారు. కివీస్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేయడంతో టీమిండియా బ్యాటర్లు వణికిపోయారు. ఐదుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్ రూపంలో వెనుదిరిగడంతో టీమిండియా స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ రూపంలో వెనుదిరిగారు.  భారత బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కూలిపోయింది. రిషబ్ పంత్(20), యశస్వి జైస్వాల్(13), మహ్మద్ సిరాజ్(04 నాటౌట్), రోహిత్ శర్మ(02), కుల్దీప్ యాదవ్(02), జస్ప్రీత్ బుమ్రా(01) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు, విలియమ్ రూర్కీ నాలుగు వికెట్లు, టిమ్ సౌతీ ఒక వికెట్ తీశాడు. 2020లో అడిలైడి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో భారత జట్టు 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. 1974 సంవత్సరంలో లార్డ్స్  ఇంగ్లాండ్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో టీమిండియా 17 ఓవర్లలో 42 పరుగులు చేసి ఆలౌటైన విషయం విధితమే. 1955వ సంవత్సరంలో అక్లాండ్ వేదికంగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 26 పరుగులు చేసి ఆలౌటైన అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News