Wednesday, January 22, 2025

రేపు ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం సాయంత్రం వెలువడిన తరువాత ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నట్లు కూటమి వర్గాలు తెలియజేశాయి. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం వ్యూహంపై చర్చించేందుకు సమావేశం కావాలని శనివారం (1న) నిర్ణయించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇండియా కూటమి అగ్ర నేతల సమావేశం మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం జరుగుతుందని ఆ వర్గాలు సూచించాయి. ఇండియా కూటమి లోని పలు పార్టీల నేతలు శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్ ఆ సమావేశానికి హాజరయ్యారు.

సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి), సిపిఐ (ఎం), సిపిఐ, డిఎంకె, జెఎంఎం, ఆప్, ఆర్‌జెడి, శివసేన (యుబిటి), ఎన్‌సిపి (శరద్ పవార్) ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్, అనిల్ దేశాయి, సీతారామ్ ఏచూరి, అర్వింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చడ్డా, చాంపై సోరెన్, కల్పనా సోరెన్, టిఆర్ బాలు, ఫరూఖ్ అబ్దుల్లా, డి రాజా, దీపంకర్ భట్టాచార్య, జితేంద్ర అవ్హద్, ముఖేష్ సహానీ సమావేశానికి హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ వ్యక్తిగత కారణాలతో సమావేశానికి హాజరు కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News