Friday, December 27, 2024

వారణాసిలో మోడీని ఢీకొట్టేది ఎవరు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున రాజకీయ సూపర్‌స్టార్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ కూటమికి చెందిన వర్గాలు తెలిపాయి. సీట్ల పంపకంపై చర్చించేందుకు మంగళవారం న్యూఢిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి నేతల మధ్య ఈ విషయం పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీపై పోటీకి బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్‌ను కాని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను కాని బరిలోకి దింపాలని కూటమి నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 1991 నుంచి(2004 మినహాయించి) వారణాసి నియోజకవర్గం బిజెపికి కంచుకోటగా ఉంటోంది. 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు ఈ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు.

బిజెపికి ఒకనాటి మిత్రుడైన నితీశ్ కుమార్ ఇప్పుడు ఆ పార్టీకి బద్ధ శత్రువుగా మారిపోయారు. ఇండియా కూటమి వ్యవస్థాపకులలో ఒకరైన నితీశ్ కుమార్ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాన మంత్రి పదవికి ప్రధాని పదవికి రేసులో ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది.ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయని ప్రియాంక గాంధీ వాద్రా 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. కాని కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ నిలబడి మోడీపై ఐదు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి మూడవ స్థానంలో నిలిచారు. నాలుగేళ్ల క్రితం కొందరు విలేకరులు ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించినపుడు ఎందుకు చేయను ఆని ప్రియాంక జవాబిచ్చారు.

2024 ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా వారణాసి నుంచి ప్రధాని మోడీపై పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం నాటి ఇండియా కూటమి సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును కూడా మమతనే ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. వారణాసిలో మూబవ ప్రత్యామ్నయంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 22014 ఎన్నికల్లో మోడీపై పోటీ చేసిన కేజ్రీవాల్ రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News