Wednesday, January 22, 2025

జూన్ 1న ఇండియా కూటమి భేటీ!

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలలో తమ పనితీరును అంచనా వేసి ఫలితాలకు ముందుగానే తమ వ్యూహాన్ని రూపొందించుకోవడానికి ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన అగ్రనాయకులు జూన్ 1న సమావేశం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆఖరి దశ ఎన్నికలు జరుగుతున్న రోజునే జూన్ 1న మధ్యాహ్నం ఢిల్లీలో కూటమికి చెందిన అగ్రనేతలు సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఏడు దశల ఎన్నికలలో తమ పనితీరును విశ్లేషించుకుని, జూన్ 4న ఫలితాలకు ముందుగానే తాము అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి వారు చర్యించనున్నట్లు వర్గాలు తెలిపాయి.

కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకుండా నిలువరించగలమని, సొంతంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష కూటమి భావిస్తున్నట్లు వారు చెప్పారు. జూన్ 1న జరిగే సమావేశాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేస్తున్నారని వర్గాలు తెలిపాయి. ఎన్నికల తర్వాత ఆమే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని అధికార కూటమి కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఇండియా కూటమి ఏర్పాటు చేసేందుకు 28 ప్రతిపక్ష పార్టీలు జతకట్టాయి. అయితే నితిష్ కుమార్ సారథ్యంలోని జనతా దళ్(యు), రాష్ట్రీయ లోక్ దళ్ తదనంతరం ఎన్‌డిఎలో చేరిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News