న్యూఢిల్లీ : కేంద్రం లోని బీజేపీని ఓడించడమే లక్షంగా ఏర్పడిన ‘ఇండియా ’కూటమి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ప్రధాన మంత్రిగా అవకాశం ఇచ్చినట్టు జేడీ(యూ) వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయన మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్నివెల్లడించారు. ‘ఇండియా కూటమి నితీశ్ కుమార్‌కు ప్రధాన మంత్రిగా ఆఫర్ ఇచ్చింది. ఆయన మాత్రం ఆ అవకాశాన్ని తిరస్కరించారు. దీని గురించి నేరుగా నితీశ్‌ను కలిసేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మేము ఎన్డీయే కూటమితో ఉన్నాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు ” అని త్యాగి పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఖండించింది. నితీశ్‌ను ప్రధానిగా చేసేందుకు ఇండియా కూటమి సంప్రదిస్తుండటంపై కాంగ్రెస్‌కు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయం గురించి కేవలం ఆయనకు మాత్రం తెలుసు”అని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కౌంటర్ ఇచ్చారు.
నితీశ్‌కు ప్రధానిగా ఇండియా కూటమి ఆఫర్ !
- Advertisement -
- Advertisement -
- Advertisement -