Monday, January 20, 2025

రేపు జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి ర్యాలీ

- Advertisement -
- Advertisement -

జుడిషియల్ కస్టడీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళవారం(జులై 30) జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిర్వహించనున్న ర్యాలీలో అందులో భాగస్వామ్య పక్షాలైన ఆప్‌తోపాటు కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌తోసహా అనేక పార్టీలు పాల్గొంటాయని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ సోమవారం వెల్లడించారు. జైలులో కేజ్రీవాల్‌ను చంపడానికి బిజెపి కుట్రపన్నిందని, జూన్ 3 నుంచి జులై 7 మధ్య కేజ్రీవాల్ సుగర్ లెవల్స్ 34 సార్లు పడిపోయినట్లు చూపుతున్న వైద్య నివేదికే ఇందుకు సాక్షమని ఆప్ ఆరోపిస్తోంది. మంగళవారం జరగనున్న ర్యాలీలో కాంగ్రెస్, ఎస్‌పి, టిఎంసి, డిఎంకె, సిపిఐ, జెఎంఎం, ఎన్‌సిపి(శరద్ పవార్), శివసేన(యుబిటి), సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పాల్గొంటున్నట్లు సంజయ్ సింగ్ తెలిపారు. మరో రెండు, మూడు పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు. అయితే ర్యాలీలో పాల్గొనే నాయకుల పేర్లు మంగళవారం నాడే చెబుతామని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News