- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వైసిపి చేపట్టిన ధర్నాకు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తాజాగా మద్దతు ప్రకటించారు. ఆమె జంతర్ మంతర్ వద్ద వైసిపి ఏర్పాటు చేసిన వీడియో, ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతుందో అందరికీ తెలిసేలా చేసిన జగన్ మోహన్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఏపిలో ఏమి జరుగుతుందో ఢిల్లీలోని వారికి తెలియదు. రాజ్యాంగానికి విలువ ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ రాజకీయ హింస ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే’’ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హింసాత్మక పరిణామాల పట్ల గవర్నర్, సుప్రీం కోర్లు కలుగజేసుకుని విచారణ జరపాలని, ఏపి ప్రజల వెంట తాముంటామని ప్రియాంక చతుర్వేది తెలిపారు.
- Advertisement -