Sunday, December 22, 2024

1977 నాటి జనతా ప్రభంజనం ఇప్పుడు “ఇండియా కూటమి”కి వీస్తోంది : దిగ్విజయ్

- Advertisement -
- Advertisement -

పాట్నా :1977లో జనతాపార్టీని అధికారం లోకి తేడానికి ప్రభంజనం ఎలా వీచిందో ఇప్పుడు “ఇండియా కూటమి”కి ప్రజల నుంచి అలాంటి మద్దతు కనిపిస్తోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ సోమవారం వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం సాదకత్ ఆశ్రమంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ తన ప్రసంగాల్లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ తనకు తాను చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. “ఎన్నికల ప్రచారంలో దేశం లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాను. నిన్న ఉత్తరప్రదేశ్‌లో తమ మిత్ర పక్షం నాయకుడు అఖిలేష్ యాదవ్ ర్యాలీల్లో పాల్గొన్నాను. భారీ జనసందోహాన్ని చూస్తుంటే ఇండియా బ్లాక్‌కు ప్రజల నుంచి భారీ మద్దతు ఉంటోందని తెలుస్తోంది. 1977 లో జనతా పార్టీకి ఏ స్థాయిలో ప్రజల మద్దతు లభించిందో ఇప్పుడు ఇండియా కూటమికి అదే స్థాయిలో మద్దతు కనిపిస్తోంది. ” అని పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్ నిబంధనలను ప్రధాని మోడీ ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్ వైఫల్యంపై పక్షపాత వైఖరిపై ఈఅనేక సందేహాలు వస్తున్నాయని ధ్వజమెత్తారు. అలాగే ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ సమర్థతపై సందేహం కలుగుతోందన్నారు. అదే పనిగా మత విద్వేష ప్రసంగాలు చేస్తూ ఒక టివి ఇంటర్వూలో తాను హిందూ ముస్లిం విభజన ఎన్నడూ సృష్టించలేదని ప్రధాని మోడీ బహిరంగంగా చెప్పారని, ఆ మరునాడే మళ్లీ మతవిభేదాల ప్రసంగాలు చేయడం ప్రారంభించారని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. కాంగ్రెస్ మతప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి అనుకూలంగా ఉందని ప్రధాని మోడీ అబద్ధాలు చెబుతూ తనకు తాను అబద్ధాల ఫ్యాక్టరీగా నిరూపించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరంగా ఆ విధంగా రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్థాన్ అణుశక్తి పట్ల నిర్లక్షం చేసిందని మోడీ ఆరోపించడాన్ని దిగ్విజయ్ తిరస్కరించారు. బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో తాము అధికారంలో ఉన్నామని దిగ్విజయ్ గుర్తు చేశారు. “ మా బలం మాకు తెలుసు. ఇది మోడీ ప్రభుత్వం చైనా భయంతో జీవిస్తోంది. సరిహద్దుల్లో చొరబాట్లు జరిగినప్పుడు మోడీ క్లీన్ చిట్ ఇవ్వగా చైనా ఏ విధంగా ప్రధాని మోడీని ప్రశంసించిందో చూడండి ” అని దిగ్విజయ్ ఆరోపించారు. ఆహార హక్కును ఉదహరిస్తూ కేవలం గత కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఎ ప్రభుత్వం చేసిన పనులనే మోడీ ప్రభుత్వం కొనసాగిస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాలే ద్రవ్యోల్బణానికి దారి తీస్తున్నాయని, పెట్రోల్ ధరల పెరుగుదలను ఉదహరించారు. సెంట్రల్ ఎక్సైజ్ పన్నులను సవరించడం ద్వారా లీటర్‌కు కనీసం రూ20 సులువుగా తగ్గించవచ్చని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News