Saturday, November 23, 2024

ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో ఇండియా కూటమి ముంబై భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ఇండియా తదుపరి మూడవది అయిన సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1వతేదీలలో ముంబైలో జరుగుతుంది. కూటమి వర్గాలు శుక్రవారం ఈ విషయం తెలిపాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశం బెంగళూరులో జరిగిన భేటీ పద్ధతిలో జరుగుతుంది. తొలిరోజు అంతా (ఆగస్టు 31) నేతలు ఇష్టాగోష్టిగా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు సెప్టెంబర్ 1న ప్రధాన సమావేశం జరుగుతుంది. ముంబైలోని పవాయ్ హోటల్‌లో విపక్ష సమావేశం ఏర్పాటు కానుంది. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం ఇండియా తరఫున విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు.

ఇండియా మూడో దఫా భేటీకి పలు సార్లు తేదీలు ప్రకటించారు. అయితే పలువురు విపక్ష నేతలు ఈ తేదీలు తమకు అనుకూలంగా లేవని తెలియచేయడంతో అన్నింటిని పరిశీలించుకుని ఇప్పుడు ముంబైలో ఈ సమావేశానికి తేదీలు ఖరారు చేశారు. ఐక్యత సాధన దిశలో ప్రతిపక్షాల తొలి భేటీ పాట్నాలో జూన్‌లో జరిగింది. రెండవది గత నెలలో బెంగళూరులో ఏర్పాటు అయింది. అప్పుడే ఇండియా కూటమి అవతరించింది. ముంబై భేటీ చాలా కీలకమైనది. పలు పార్టీల మధ్య సమన్వయం కోసం 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు అవుతుంది. ఈ భేటీలోనే 26 ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కన్వీనర్ ఎంపిక జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News