Tuesday, November 5, 2024

మొబైల్ యాప్స్‌లో టైమ్‌పాస్ చేస్తున్న టాప్ ఐదు దేశాల్లో భారత్ !

- Advertisement -
- Advertisement -

time spending on apps
న్యూఢిల్లీ: రోజుకు 4 గంటల కన్నా ఎక్కువ సేపు మొబైల్‌లో కాలం వెచ్చిస్తున్న టాప్ ఐదు దేశాల్లో భారత్ ఒకటి. దక్షిణ కొరియా, మెక్సికోలు కూడా టాప్ లో ఉన్నాయి.  భారతీయులు మొబైల్ యాప్స్‌లో రోజుకు 4.8 గంటలు వెచ్చిస్తునారని ‘యాప్ అన్నీ’ అనే పరిశోధన సంస్థ డేటా తెలిపింది. అందరికంటే ఎక్కువ కాలం వెచ్చిస్తున్న దేశాల్లో ఇండోనేషియా(రోజుకు 5.5 గంటలు) ఉండగా, తర్వాతి స్థానాల్లో బ్రెజిల్(5.4గ.), జపాన్, కెనడా, రష్యా, అమెరికా, టర్కీ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తదితర 12 దేశాలున్నాయి. టిక్‌టాక్‌లో షార్ట్ వీడియోల డౌన్‌లోడ్, వాట్సాప్ మెసెంజర్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ యాప్స్, జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్, ఇతర యాప్స్‌లలో వీరు కాలాన్ని వెచ్చిస్తున్నారని ఆ పరిశోధనలో వెల్లడయింది. ఇదిలా ఉంటే గ్రహించాల్సిన మరో విశేషమేమిటంటే ఓ దశాబ్దం ముందు రోజుకు కనీసం 3గంటలు టెలివిజన్ చూడ్డంలో కాలాన్ని వెచ్చించేవారు. కానీ ఇప్పుడది రోజుకు 2.5 గంటలకు తగ్గిపోయిందని కూడా ఈ పరిశోధనలో వెల్లడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News