Saturday, December 21, 2024

అసంతుష్టిత దేశాల్లో భారత్… @136

- Advertisement -
- Advertisement -

Unhappy
న్యూఢిల్లీ: ప్రపంచ సంతోష సూచీలో భారత్ 136వ స్థానంలో ఉంది. గత ఏడాది ఉన్న 139వ స్థానం నుంచి కాస్త మెరుగుపడింది. కాగా తాలిబాన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్థాన్, భారత్ కన్నా కొంచెం హీనంగానే ఉంది. ఆఫ్ఘనిస్థాన్ 146 దేశాల సూచీలో అట్టడుగు స్థానంలో ఉంది. కాగా నేపాల్(84), బంగ్లాదేశ్ (94), పాకిస్థాన్(121), శ్రీలంక(127) ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ దేశాలన్నీ భారత్ కన్నా మెరుగుగానే ఉన్నాయి. ప్రపంచ సంతోష నివేదిక 10వ ఎడిషన్‌లో ఫిన్లాండ్ వరుసగా ఐదోసారి టాప్‌లో నిలిచింది. ఈ నివేదికను యునైటెడ్ సస్టయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ ప్రచురించింది. జిడిపి, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, దేశంలో అవినీతి స్థాయి వంటి అంశాలతో ఈ ప్రపంచ సంతోష నివేదికను రూపొందించడం జరుగుతుంది. టాప్‌లో ఉన్న ఫిన్లాండ్ తర్వాత స్థానాల్లో డెన్మార్క్, ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ వంటి పాశ్చాత్య దేశాలే ఉన్నాయి. కాగా బ్రిటన్ 17వ స్థానంలో, ఫ్రాన్స్ 20వ స్థానంలో నిలిచాయి. అసంతుష్టిత దేశాలలో భారత్ ఉందని ఆ  నివేదిక పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News