మాల్దీవ్స్: దక్షిణాసియా(శాఫ్) ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్‌ను నమోదు చేశాయి. దీంతో ఈ మ్యాచ్ 11తో డ్రా అయ్యింది. ఇక ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌ను నిలువరించడంలో బంగ్లాదేశ్ సఫలమైంది. పది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను ఆడిన బంగ్లాదేశ్ అసాధారణ ఆటతో భారత్ గెలుపు అవకాశాలకు గండి కొట్టింది. ఆరంభంలో భారత్ పైచేయి సాధించింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి రికార్డు గోల్‌ను సాధించడంతో ప్రథమార్ధంలో భారత్ 10 ఆధిక్యంలో నిలిచింది. ఫస్ట్ హాఫ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే ద్వితీయార్ధంలో బంగ్లాదేశ్ అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. భారత గోల్ పోస్ట్ వైపు పదేపదే దాడులు చేస్తూ స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించింది. 74వ నిమిషంలో బంగ్లాదేశ్ ప్రయత్నం ఫలించింది. యాసిన్ అరాఫాత్ అద్భుత గోల్‌తో స్కోరును సమం చేశాడు. తర్వాత భారత్ పైచేయి సాధించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మాల్దీవ్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరుగుతోంది.
India and Bangladesh football match draw