న్యూఢిల్లీ : మరో దఫా సైనిక స్థాయి చర్చలకు భారత్ చైనాలు అంగీకారానికి వచ్చాయి. సాధ్యమైనంత త్వరలోనే ఈ 14వ దఫా చర్చలను చేపట్టాలని గురువారం ఇరుపక్షాలు నిర్ణయానికి వచాచయి. సరిహద్దుల వ్యవహారాల సంప్రదింపుల సంబంధిత సలహా, సమన్వయ కార్యాచరణ యంత్రాంగం (డబ్లుఎంసిసి) వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో భేటీ అయింది. ఈ దశలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ భేటీ రహస్యంగా సవిస్తారితంగా జరిగిందని తరువాత అధికార వర్గాలు తెలిపాయి. ఈస్టర్న్ లద్ధాఖ్‌లో ఇప్పటికీ ఘర్షణ కేంద్రాలుగా ఉన్న చోట్ల నుంచి నిస్సైనికీరణ జరగాల్సి ఉందని ఇరుదేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ప్రత్యేకించి లద్ధాఖ్, ఎల్‌ఎసి వెంబడి పరిస్థితిని సమీక్షించారు. ఇరు పక్షాల మధ్య ఇప్పటివరకూ పలు దఫాలుగా సైనికాధికారుల స్థాయి సమావేశాలు జరుగుతూ వచ్చాయి. చిట్టచివరిసారి జరిగిన సంప్రదింపుల తరువాత జరిగిన పరిణామాలు, ఉద్రిక్తతల సడలింపు క్రమంలో అమలు అయిన చర్యలు సమీక్షించారు. ఇరుదేశాలకు చెందిన సైనిక సీనియర్ దళాధికారుల స్థాయిలో జరిగే 14వ దఫా చర్చలకు అతి సమీప తేదీనే ఖరారు చేయాల్సిన అవసరం ఉందని ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చాయని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు సంక్షిప్తంగా తెలిపారు.
భారత్ చైనా 14వ దఫా చర్చలకు అంగీకారం
- Advertisement -
- Advertisement -
- Advertisement -