Saturday, November 23, 2024

భారత్ చైనా మధ్య 19 వ దఫా చర్చలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆగస్టు 13,14 తేదీల్లో కార్ప్ కమాండర్ స్థాయి చర్చలు చుసుల్‌మాల్దో సరిహద్దులో జరిగాయి. వాస్తవాధీన రేఖ వద్ద అనేక అంశాల్లో ఇరు వర్గాలు సానుకూల , నిర్మాణాత్మక చర్చలు జరిపాయని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల అగ్రనాయకత్వ మార్గదర్శకాల ప్రకారం వారు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా, మున్ముందు చర్చలు కొనసాగే పద్ధతిలో జరిపారని వివరించింది. మిగిలిన సమస్యలను క్రమంగా పరిష్కరించుకోవడం, ఈమేరకు సైనిక , దౌత్యపరంగా చర్చలు, సంప్రదింపులు కొనసాగించేందుకు అంగీకారం తెలిపాయని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News