- Advertisement -
న్యూఢిల్లీ : బీజింగ్‌లో బుధవారం తొలిసారి భారత్, చైనా ప్రతినిధులు వ్యక్తిగతంగా సమావేశమై సరిహద్దు సమస్యలపై చర్చించారు. వాస్తవ నియంత్రణ రేఖ పశ్చిమ సెక్టార్ వెంబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనపై చర్చించారు. మిగిలిన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణను నిర్మాణాత్మక పద్ధతిలో కొనసాగించాలని ప్రతిపాదించారు. అయితే సరిహద్దులో మోహరించిన సైనిక దళాల ఉపసంహరణతోనే ద్వైపాక్షిక సంబంధాల సాధారణ స్థితి పునరుద్ధరణకు వీలు కలుగుతుందని భారత్ స్పష్టం చేసింది.
చైనా రాజధాని బీజింగ్‌లో తొలిసారి ఈ సమావేశం జరగడం విశేషం. ఉభయ దేశాల సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కో ఆర్డినేషన్ (డబ్లుఎంసీసీ) ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయి. 2019 తరువాత ఇరు దేశాల సమావేశం జరగడం ఇదే మొదటిసారి. అలాగే ఇరు దేశాల వ్యక్తిగత సమావేశం కూడా ఇదే కావడం మరో విశేషం.
- Advertisement -