Saturday, November 23, 2024

లద్దాఖ్ సరిహద్దులో భారత్, చైనా ఉమ్మడి గస్తీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తూర్పు లద్దాఖ్ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి సంయుక్తంగా గస్తీ నిర్వహించడానికి భారత్, చైనా దేశాలు ఒప్పందానికి వచ్చాయి. భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. మిగిలిన సమస్యలపై కూడా గతకొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

డెస్పాంగ్, డెమ్‌చోక్ ఏరియాల్లో ఈమేరకు పెట్రోలింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. బ్రిక్స్ సదస్సుకు రష్యా నగరం కజన్‌కు భారత ప్రధాని నరేంద్రమోడీ బయలుదేరడానికి ఒక రోజు ముందు ఈ ఒప్పందం కుదరడం విశేషం. బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని అనధికారికంగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News