Tuesday, April 1, 2025

మలేషియాతో వాణిజ్యం ఇక మన రూపాయల్లో…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అనేక దేశాలు నేడు భారత్‌తో రూపాయల్లో వాణిజ్యం చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటికే రష్యా, మారిషస్, శ్రీలంక రూపాయల్లో ఎగుమతి, దిగుమతి చేస్తుండగా తాజాగా మలేషియా కూడా చేరింది. ఇకపై భారత్, మలేషియా మధ్య వాణిజ్య ట్రేడ్ సెటిల్‌మెంట్‌లు ఇతర కరెన్సీలతోపాటు రూపాయల్లోనూ జరుగుతాయని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిపై ఓ ప్రకటనను కూడా శనివారం విడుదలచేసింది. ఇప్పుడు మలేషియాతో వాణిజ్యం ప్రస్తుతమున్న కరెన్సీలతోపాటు రూపాయల్లోనూ జరుగనున్నది. ఇందుకోసం కౌలాలంపూర్‌లోని ఇండియా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా(ఐఐబిఎం), భారత్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రత్యేక రూపీ వోస్ట్రో ఖాతాలను అందుబాటులోకి తెచ్చింది’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News