- Advertisement -
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయడు ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడం పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌బాగ్చీ స్పష్టం చేశారు. తమ నేతలు దేశంలోని మిగతా రాష్ట్రాలకు వెళ్లినట్టే అరుణాచల్‌కూ వెళ్తారని, అందుకు చైనా అభ్యంతరం చెప్పడం హేతు విరుద్ధమని బాగ్చీ విమర్శించారు. అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లో భాగంగా చైనా చెబుతోంది. అందుకు చైనాను భారత్ తీవ్రంగా తప్పు పడుతోంది. ఇటీవల ఇరు దేశాల కార్ప్ కమాండర్ల మధ్య జరిగిన 13వ విడత చర్చల్లో వాస్తవాధీనరేఖ(ఎల్‌ఎసి)లోని వివాదాస్పద పాయింట్ల నుంచి బలగాల ఉపసంహరణపై ఎలాంటి అంగీకారం కుదరకపోవడానికి చైనానే కారణమని భారత్ విమర్శించిన నేపథ్యంలో ఈ తాజా పరిణామాల్ని అర్థం చేసుకోవాల్సి ఉన్నది.
- Advertisement -