ముంబై: వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండ ర్-19 వరల్డ్‌కప్ టోర్నీకి బిసిసిఐ జట్టును ప్రకటించింది. 17 మంది ప్లేయర్లు, ఐదుగురు స్టా ండ్ బై ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది బోర్డు. ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెం దిన షేక్ రషీద్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించా రు. కాగా, ఢిల్లీకి చెందిన యష్ దుల్, ఆసియా కప్ టోర్నీతో పాటు అండర్-19 వరల్ కప్ టో ర్నీలోనూ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. డిసెంబర్ 23 నుంచి యుఎఇ వేదికగా జరిగే ఆసియా కప్ టోర్నీలో పాల్గొనే భారత యువ జట్టు, ఆ తర్వాత జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటుంది. జనవరి 14 నుంచి వెస్టిండీస్ వేదికగా వన్డే ఫార్మాట్‌లో అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది.
అండర్-19 వరల్డ్ కప్ జట్టు
యశ్ దుల్ (కెప్టెన్), షేక్ రషీద్ (వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, నిశాం త్ సింధు, సిద్థార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేశ్ బనా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగద్ బవా, మానవ్ పరాక్, కుశాల్ తంబే, ఆర్‌ఎస్ హంగర్కేర్, వసు వాత్స్, విక్కీ ఉత్సవల్, రవి కుమార్, గర్వ్ సంగ్వాన్
స్టాండ్ బై ప్లేయర్లు
రిషిత్‌రెడ్డి, ఉదయ్ శరవణ్, అన్ష్ ఘోసాయ్, అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, పిఎం సింగ్ రాథోర్