Friday, December 20, 2024

మాజీ నేవీ ఆఫీసర్ల మరణశిక్షపై భారత్ పోరాటం.. అప్పీల్ ను స్వీకరించిన ఖతార్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయ నేవీ ఆఫీసర్ల మరణశిక్షను సవాల్ చేస్తూ ఇండియా దాఖలు చేసిన అప్పీల్‌ను ఖతార్ కోర్టు శుక్రవారం అంగీకరించింది. ప్రైవేట్ కంపెనీ అల్ దహ్రాతో కలిసి పనిచేసిన 8మంది భారత మాజీ నేవీ ఆఫీసర్లను ఖ‌తార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేసింది. అయితే, ఖ‌తార్ ప్ర‌భుత్వం మాత్రం భారత నేవీ ఆపీసర్ల అరెస్టుపై ఎటువంటి ఆరోప‌ణ‌లు చేయ‌లేదు.ఈ కేసులో 8మందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది.

ఈ క్రమంలో వారిని విడిపించేందుకు భారత్ పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసినా.. ఖతార్ కోర్టు తిరస్కరించింది. తాజాగా భారత్ వేసిన బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు ఖతార్ కోర్టు అంగీకరించింది. దీంతో భారత నేవీకి చెందిన మాజీ అధికారుల బెయిల్ పిటిషన్ పై త్వ‌ర‌లోనే ఖతార్ కోర్టు విచార‌ణ చేపట్టనుంది. కాగా, అరెస్టు అయిన 8మంది భారత నేవీలో దాదాపు 20ఏళ్లు పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News