Tuesday, November 5, 2024

యాంటీబాడీ కాక్‌టెయిల్‌కు భారత్ ఓకే

- Advertisement -
- Advertisement -

India approves anti-Covid cocktail

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వాడిన ఔషధంతో సత్ఫలితాలు
త్వరలో దేశంలో అందుబాటులోకి, స్విట్జర్లాండ్ తయారీ సంస్థ రోచ్‌కు
అనుమతులు, మార్కెటింగ్, పంపిణీ బాధ్యత సిప్లాకు అప్పగింత

న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయంలో కరోనా బాధితుడైనప్పుడు యాంటీబాడీ కాక్‌టెయిల్ వాడగానే ఆయన వేగంగా కోలుకున్నారు. ఇప్పుడు ఆ కాక్‌టెయిల్ ఔషధం భారత్‌కి అందుబాటు కానున్నది. స్విట్జర్లాండ్‌కు చెందిన రోచ్ అనే ఔషధ తయారీ సంస్థకు భారత్ లోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతానికి దీన్ని దిగుమతి చేసుకుని విక్రయిస్తారు. భారత్‌లో దీని మార్కెటింగ్ , పంపిణీ వ్యవహారాలను సిప్రా కంపెనీ చూస్తుంది. రెండు రకాల యాంటీబాడీలను అమెరికాకు రీజనరాన్ సంస్థతో కలసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తోంది.

సాధారణంగా రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే ప్రొటీన్లే యాంటీబాడీలు. టీకా ఇచ్చినప్పుడు లేదా వ్యాధి సోకినప్పుడు ఈ యాంటీబాడీలు విడుదల కావడానికి కొన్ని వారాలు పడుతుంది. అదే తాజా డ్రగ్‌లో ప్రయోగశాలల్లో జంతువులపై చేసే ప్రయోగాల్లో కరోనా వైరస్‌పై సమర్ధంగా పనిచేసిన యాంటీబాడీలను వినియోగిస్తున్నారు. వీటిని నేరుగా శరీరం లోకి ఎక్కించడం ద్వారా వైరస్‌పై తక్షణ ప్రభావం ఉంటుందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే కాసిరివి మాబ్, ఇమ్డివి మాబ్ లను కలిపి ఈ కాక్‌టెయిల్ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఎక్కువ రిస్కులో ఉన్న రోగుల చికిత్సకు దీన్ని వినియోగిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News