Sunday, January 12, 2025

భారత్‌కు మరో రెండు స్వర్ణాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో భారత్ మరో రెండు స్వర్ణాలను సొంతం చేసుకుంది. చైనాలోనిచెంగ్డూ నగరంలో జరుగుతున్న ఈ క్రీడల్లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ వర్శిటీలకు చెందిన క్రీడాకారులు పోటీ పడుతున్నారు. సోమవారం ఆర్చరీ విభాగంలో భారత్‌కు రెండు పసిడి పతకాలు లభించాయి. భారత ఆర్చర్లు సంగమ్‌ప్రీత్ సింగ్ బిస్లా, అవ్‌నీత్ కౌర్‌లు స్వర్ణాలు సొంతం చేసుకున్నారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో సంగమ్‌ప్రీత్ సింగ్, మహిళల వ్యక్తిగత విభాగంలో అవ్‌నీత్‌లు పసిడి పతకాలు సాధించారు. ఈ పోటీల్లో భారత్ ఇప్పటి వరకు నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, మరో ఐదు కాంస్య పతకాలు సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News