Sunday, January 19, 2025

హాకీలో భారత్‌కు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

హాంగ్‌జౌ: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ నయా చరిత్రను లిఖించింది. హాంగ్‌జౌ క్రీడల్లో భారత్ వంద పతకాలకు చేరువైంది. శుక్రవారం రోజు ఆటలు ముగిసే సమయానికి భారత్ 95 పతకాలను సొంతం చేసుకుంది. దీంతో పాటు మరో ఏడు పతకాలను ఖాయం చేసుకుంది. చివరి రెండు రోజుల్లో భారత్ తన పతకాల సంఖ్యను వందకు పెంచుకోనుంది. ఇక శుక్రవారం భారత్ హాకీలో స్వర్ణం సాధించింది. దీంతో పాటు వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. జపాన్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 51 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ప్రారంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. 25వ నిమిషంలో భారత్‌కు తొలి గోల్ లభించింది. 32వ నిమిషంలో రెండో, 36వ నిమిషంలో మూడో గోల్ చేసింది. అంతేగాక 48వ నిమిషంలో నాలుగో, 59వ నిమిషంలో ఐదో గోల్‌ను భారత్ నమోదు చేసింది. జపాన్ ఏకైక గోల్‌ను 51వ నిమిషంలో సాధించింది. ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఆడిన అన్ని మ్యాచుల్లో గెలిచి స్వర్ణం గెలుచుకోవడం విశేషం. పసిడి పతకం సాధించడంతో పాటు ఒలింపిక్ బెర్త్‌ను కూడా కూడా దక్కించుకుంది.

ఫైనల్లో సాత్విక్ జోడీ
మరోవైపు బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డిచిరాగ్ శెట్టి జంట ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఈ విభాగంలో భారత్ కనీసం రజత పతకం ఖాయమైంది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సాత్విక్ జోడీ 2117, 2112 తేడాతో మలేసియాకు చెందిన అరోన్ చియాసో వుయ్ జంటను ఓడించింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ సెమీ ఫైనల్లో ఓటమి చవిచూశాడు. దీంతో ప్రణయ్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇక కబడ్డీలో భారత పురుషులు, మహిళల జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. దీంతో కబడ్డీలో భారత్‌కు రెండు రజతాలు ఖాయమయ్యాయి. ఇక ఆర్చరీలో భారత్‌కు రజతం దక్కింది. రెజ్లింగ్‌లో సోమ్, కిరణ్ కాంస్యలు సాధించారు. సెపక్‌తక్రాలో కూడా భారత్‌కు కాంస్య లభించింది. బ్రిడ్జ్ పోటీల్లో భారత్ రజతం సాధించింది. శుక్రవారం పోటీలు ముగిసే సమయానికి భారత్ 95 పతకాలను సాధించింది. ఇందులో 22 స్వర్ణాలు, 34 రజతాలు మరో 39 కాంస్య పతకాలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News