న్యూఢిల్లీ: కొవిడ్19 వ్యాక్సిన్ల ఎగుమతులపై భారత్ నిషేధం విధించడం వల్ల 91 దేశాలపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌ఒ) తెలిపింది. ఈ దేశాలు వ్యాక్సిన్ల కోసం ప్రధానంగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌పై ఆధారపడటమే అందుకు కారణమని డబ్లూహెచ్‌ఒ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ పేర్కొన్నారు. త్వరలో వాడుకలోకి రానున్న నొవావాగ్జ్ వ్యాక్సిన్ల సరఫరాపైనా ప్రభావం ఉంటుందని ఆమె తెలిపారు. నొవావాగ్జ్‌ను కూడా ఎస్‌ఐఐలోనే ఉత్పత్తి చేయనున్నారు. ఎస్‌ఐఐ నుంచి సరఫరాలు లేనపుడు ఆ దేశాలకు కొరత ఏర్పడుతుందని సౌమ్య వివరించారు. ప్రభావిత దేశాల్లో అధికభాగం ఆఫ్రికన్ దేశాలేనని ఆమె తెలిపారు. ఆ దేశాల్లో భారత్‌లో కరోనా ఉధృతికి కారణమైన బి.1.617.2లాంటి వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రపంచంలో మరికొన్ని వేరియంట్లు కూడా ఉధృతికి కారణమవుతున్నాయని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 117 వేరియంట్లను ప్రమాదకరమైనవిగా గుర్తించినట్టు ఆమె తెలిపారు.
వ్యాక్సిన్ల ఎగుమతులపై భారత్ విధించిన నిషేధంతో 91 దేశాలకు గడ్డు పరిస్థితి
- Advertisement -
- Advertisement -
- Advertisement -