Saturday, September 14, 2024

156 ఔషధాలపై నిషేధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలపై నిషేధం విధించింది. జ్వరం, జలుబు, అలర్జీ, దురద, నొప్పికి ఉపయోగించే 156 ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ లను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఔషధాల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన నోటిఫికేసన్ ను కూడా విడుదల చేసింది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్(డిటిఏబి) నిపుణుల కమిటీ సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

నిషేధించిన ఔషధాలలో అసెక్లోఫెనాక్ 50ఎంజి, పారాసెటిమాల్ 125 ఎంజి టాబ్లెట్, మెఫెనామిక్ యాసిడ్, పారాసెటిమాల్ ఇంజెక్షన్, సెట్రిజైన్ హెచ్ సిఎల్ వంటివి ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News