Tuesday, November 5, 2024

232 చైనా యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం మళ్లీ చైనాకు భారీ షాకిచ్చింది. దేశంలో ఒకేసారి 232 చైనా యాప్‌లను అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. నిషేధం విధించిన వాటిలో 138 బెట్టింగ్ యాప్‌లు, 98 లోన్ యాప్‌లు ఉన్నాయి. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం వీటిని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. చైనా లింకులు కలిగి ఉన్నట్లు గుర్తించడంతో ఈ యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరు నెలల క్రితం 28 చైనా లోన్ లెండింగ్ యాప్‌లపై నిఘా పెట్టింది. కాగా ఈస్టోర్‌లో 94 యాప్‌లు అందుబాటులో ఉన్నాయని, మరికొన్ని థర్డ్‌పార్టీ లింక్‌ల ద్వారా పనిచేస్తున్నాయని గుర్తించింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం కారణంగా ఈ యాప్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. జూన్ 2020 నుంచి టిక్‌టాక్, షేరిట్, విచాట్, హలో, లైకీ, యూసి న్యూస్, బిగో లైవ్, యూసి బ్రౌజర్, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, ఎంఐ కూమ్యూనిటీ వంటి ప్రముఖ అప్లికేషన్‌లు సహా 200కు పైగా చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News