ఇదివరలో అంచనా వేసిన 111.3 మిలియన్ టన్నుల గోధుమల దిగుబడి కంటే ప్రస్తుతం అంతర్గత ప్రభుత్వ ఉత్పత్తి అంచనా 95 మిలియన్ టన్నులుగా ఉంది.
న్యూఢిల్లీ: వార్షిక వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో దాదాపు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరిందని డేటా చూపించిన ఒక రోజు తర్వాత, రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం దానికి మించి 8.38 శాతానికి చేరింది. కాగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం నుండి గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది.
అధిక పౌష్టికత ఉన్న, సాధారణ సాఫ్ట్ బ్రెడ్ రకాలకు చెందిన అన్ని రకాల గోధుమల ఎగుమతిని మే 13 నుంచి ఫ్రీ నుంచి నిషిద్ధ కేటగిరికి మార్చారు. ప్రభుత్వ ఏజెన్సీల సేకరణ 15 ఏళ్ల దిగువ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ నిషేధం అమలులోకి వచ్చింది. ప్రస్తుత మార్కెటింగ్ సీజన్లో 18 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలనే ప్రభుత్వ ఏజెన్సీలు కొన్నాయి. 2021-22 సీజన్లో ఇది 43.3 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది.
భారతదేశం నుండి గోధుమ ఎగుమతులు పెంచేందుకు మొరాకో, ట్యునీషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, టర్కీ, అల్జీరియా మరియు లెబనాన్ వంటి తొమ్మిది దేశాలకు వాణిజ్య ప్రతినిధులను కేంద్రం పంపుతున్నట్లు వాణిజ్య విభాగం ఆసక్తికరంగా గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కానీ వాస్తవానికి ఎగుమతి నిషేధ నోటిఫికేషన్ ఒక రోజు తర్వాత వచ్చింది, పరిస్థితి ఎంత త్వరగా మలుపు తిరిగిందో చూపిస్తోంది.