Friday, November 22, 2024

భారత యువ జట్టు విజయం

- Advertisement -
- Advertisement -

India beat Afghanistan by four wickets

అండర్19 ఆసియా కప్

దుబాయి: ఆసియాకప్ అండర్19 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ రెండో విజయం నమోదు చేసింది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ యువ జట్టు నాలుగు వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. కెప్టెన్ సులేమాన్ సాఫి, ఎజాజ్ అహ్మద్‌లు జట్టును ఆదుకున్నారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సాఫి 86 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేశాడు. ఇక చెలరేగి ఆడిన ఎజాజ్ 68 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 86 పరుగులు చేఇ అజేయంగా నిలిచాడు. కైబర్ అలీ 20 (నాటౌట్) కూడా రాణించడంతో అఫ్గాన్ మెరుగైన స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు హార్నూర్ సింగ్ (65), రఘువంశీ (35) తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించి శుభారంభం అందించారు. కెప్టెన్ యశ్ ధుల్ (26), రాజ్ బావా 43 (నాటౌట్), కుశాల్ తంబే 35 (నాటౌట్) మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. దీంతో భారత్ జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో భారత్‌కు సెమీస్ బెర్త్ దాదాపు ఖరారైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News