- Advertisement -
ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో టి20లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ (45) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.బ్రైడన్‌క్రాస్ (31) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయాన్నిఅందుకుంది. హైదరాబాదీ తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 55 బంతుల్లో ఐదు సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు. అతనికి వాషింగ్టన్ సుందర్ (26) అండగా నిలిచాడు.
- Advertisement -