Sunday, January 19, 2025

హాకీలో భారత్ బోణీ

- Advertisement -
- Advertisement -

India beat Ghana by 50 goals

 

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో భారత్ 50 గోల్స్ తేడాతో ఘనాను చిత్తు చేసింది. ఆరంభం నుంచే భారత మహిళల జట్టు దూకుడుగా ఆడింది. వరుస దాడులతో ప్రత్యర్థి జట్టును హడలెత్తించింది. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే గుర్జిత్ కౌర్ అద్భుత గోల్‌ను సాధించింది. కొద్ది సేపటికే నేహా భారత్‌కు రెండో గోల్‌ను అందించింది. ఈ తర్వాత కూడా భారత్ గోల్‌కు కోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ప్రథమార్ధం ముగిసే సమయానికి భారత్ 20 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో భారత్ మరింత దూకుడును ప్రదర్శించింది. ఎటాకింగ్ గేమ్‌తో ఘనాను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ క్రమంలోనే సంగీత, గుర్జీత్‌లు చెరో గోల్ చేశారు. చివర్లో సలిమా కూడా మరో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 50కు చేరింది. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత ఘన విజయం అందుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News