Sunday, December 22, 2024

సెమీ ఫైనల్లో భారత్

- Advertisement -
- Advertisement -

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవాం నేపాల్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్ 23 పరుగుల తేడాతో నేపాల్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 49 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోరర్లతో 100 పరుగులు చేశాడు.

రుతురాజ్ గైక్వాడ్ (25)తో కలిసి తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించాడు. చివర్లో రింకు సింగ్ 15 బంతుల్లోనే 4 సిక్సర్లు, రెండు ఫోర్లతో అజేయంగా 37 పరుగులు చేశాడు. శివమ్ దూబే 25 (నాటౌట్) కూడా రాణించడంతో భారత్ భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్‌లు మూడేసి వికెట్లు తీసి జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News