Friday, December 20, 2024

మూడో వన్డేలో భారత్ ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 386 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 41.2 ఓవర్లలో 295 పరుగుల వద్ద ఆలౌటైంది. కివీస్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ కాన్వే(138) ఒక్కడే సెంచరీతో రాణించాడు. మిగతా వారందరూ విఫలమయ్యారు. దీంతో కివీస్ జట్టుపై 90 పరుగుల భారీ ఆధిక్యంతో గెలుపొందింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగుల సాధించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(101) శుభ్ మన్ గిల్(112)లు సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ 212 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. చివర్లలో హర్దిక్ పాండ్యా(54) చెలరేగి ఆడాడు. దీంతో టీమిండియా 3-0తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News