Wednesday, September 18, 2024

భారత్‌కు నాలుగో విజయం

- Advertisement -
- Advertisement -

ఇక్కడ జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా నాలుగో విజయం సాధించింది. గురువారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 31 గోల్స్ తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. వరుస దాడులతో కొరియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. పదేపదే ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్ వైపు దాడులు చేస్తూ గోల్ కోసం ప్రయత్నించింది. 8వ నిమిషంలో భారత్ ప్రయత్నం ఫలించింది. అరైజీత్ సింగ్ భారత్‌కు తొలి గోల్ సాధించి పెట్టాడు. 9వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు రెండో గోల్ అందించాడు. తర్వాత కూడా భారత్ అటాకింగ్ గేమ్‌తో అలరించింది. మరోవైపు కొరియా కూడా దూకుడుగా ఆడింది. దీంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఎట్టకేలకు 30వ నిమిషంలో కొరియా గోల్ సాధించింది.

జిహున యాంగ్ ఈ గోల్ చేశాడు. తొలి హాఫ్ ముగిసే సమయానికి భారత్ 21 ఆధిక్యంలో నిలిచింది. ఇక సెకండ్ హాఫ్ 43వ నిమిషంలో భారత్‌కు మూడో గోల్ లభించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఈ గోల్ నమోదు చేశాడు. దీంతో భారత్ 31 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి వరకు దీన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత్ వరుసగా నాలుగో విజయంతో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుది. ఇక చివరి మ్యాచ్‌లో హర్మన్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. శనివారం ఈ పోరు జరుగనుంది. మరోవైపు భారత్ తొలి మ్యాచ్‌లో 30తో ఆతిథ్య టీమ్ చైనాపై, రెండో మ్యాచ్‌లో 51తో జపాన్‌ను, మూడో మ్యాచ్‌లో 81 గోల్స్ తేడాతో మలేసియాను చిత్తు చేసింది. కాగా, ఐదు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News