Wednesday, January 22, 2025

లంకపై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం శ్రీలంకతో జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో టీమిండియా 82 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలు శుభారంభం అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన షఫాలీ 40 బంతుల్లో 4 ఫోర్లతో 43 పరుగులు చేసింది. మరోవైపు మంధాన ధాటిగా బ్యాటింగ్ చేసింది.

చెలరేగి ఆడిన మంధాన 38 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు సాధించింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న హర్మన్‌ప్రీత్ 27 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. కవిశా ధిల్హారి (21), అనుష్క (20), కాంచన (19) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, శోభన మూడేసి వికెట్లను పడగొట్టారు. రేణుకా సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News