Tuesday, September 17, 2024

శ్రీలంకపై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమిండియా వరుసగా ఏడో నమోదు చేసింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురవారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 302 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా ఏడో విజయం కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన శ్రీలంక 19.4 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

లంక జట్టులో ఐదుగురు బ్యాటర్లు సున్నాకే పెవిలియన్ చేరడం విశేషం. భారత బౌలర్లలో మహ్మద్ షమి అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడిన షమి 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. మరోవైపు మహ్మద్ సిరాజ్ 16 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది. శ్రీలంక జట్టులో కసున్ రజిత (14), మహీశ్ తీక్షణ 12 (నాటౌట్), ఎంజిలో మాథ్యూస్ (12) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News