Wednesday, January 22, 2025

మూడో వన్డేలో భారత్ రికార్డు విజయం..

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్‌: చివరి మూడో వన్డేలో వెస్టిండీస్‌పై 200 పరుగుల తేడాతో భారత్ రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు శుభ‌మ‌న్ గిల్(85), ఇషాన్ కిషన్(77)లతోపాటు సంజూ శాంస‌న్(51), హర్దిక్ పాండ్యా(70)లు అర్థ శతకాలతో రాణించారు.

అనంతరం 352 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు కేవలం 151 పరుగులకే ఆలౌటైంది. దీంతో విండీస్ ఘోరంగా ఓటమి పాలైంది. భారత బౌలర్లలో శార్దూల్ నాలుగు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, జ‌య‌దేవ్ ఒక‌ వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో భారత్ 2-1తేడాతో వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న‌ది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News