- Advertisement -
ఫ్లోరిడా: వెస్టిండీస్‌తో శనివారం జరిగిన కీలకమైన నాలుగో టి20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య చివరి టి20 ఆదివారం జరుగనుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెట్‌మెయిర్ (61), షై హోప్ (45) జట్టును ఆదుకున్నారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 17 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు చేయగా, గిల్ 47 బంతుల్లో ఐదు సిక్స్‌లు, మూడు బౌండరీలతో 77 పరుగులు సాధించాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 165 పరుగులు జోడించారు. దీంతో భారత్ అలవోక విజయాన్ని అందుకుంది.
- Advertisement -