Thursday, January 23, 2025

2022లో రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత ఏడాది(2022) దేశ ఆటోమొబైల్ రంగం మంచి అమ్మకాలను నమోదు చేసింది. ముఖ్యంగా కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో 34.31 లక్షలకు చేరుకున్నాయి. అయితే డిసెంబర్ నెలలో రిటైల్ వాహనాల మొత్తం అమ్మకాలు 5.40 శాతం క్షీణించాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫడా) గురువారం తన గణాంకాలను విడుదల చేసింది. ఫడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ, అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగల సీజన్‌లో వాహనాల అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి.

డిసెంబర్ నెలలో స్వల్ప బలహీనత ఉంది. దీని కారణంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గాయి. ఇది గత నెలలో వాహనాల మొత్తం అమ్మకాలపై ప్రభావం చూపింది. 2022లో వాహన విక్రయాలు 15.28 శాతం పెరిగి 2.11 కోట్లకి చేరాయి. 2021లో 1.83 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంలో కార్ల విక్రయాలు 34.31 లక్షలకు చేరుకున్నాయి, ఇది 2021నాటి 29.49 లక్షల కంటే 16.35 శాతం ఎక్కువగా ఉంది. 2022 సంవత్సరంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13.37 శాతం పెరిగి 1.53 కోట్లకి చేరుకున్నాయి. 2021లో 1.35 కోట్ల ద్విచక్ర వాహనాలు సేల్ అయ్యాయి. డిసెంబర్ 2022లో మొత్తం 16.22 లక్షల వాహనాలు విక్రయించగా, 2021లో 17.14 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది 5.40 శాతం తక్కువగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News