Friday, January 24, 2025

అమెరికాకు భారతీయ డాక్టర్లే ఊతం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో ఎక్కువ ఇమ్మిగ్రేషన్ డాక్టర్లు భారతీయులే. అక్కడి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ లో మన డాక్టర్లే అధికం. ఇక నర్సుల విషయానికి వస్తే  ఫిలిప్పీన్స్, మెక్సికో తర్వాత భారతీయ నర్సులదే మూడో ర్యాంకు.

అమెరికాలోని 9.87 లక్షల డాక్టర్లలో భారతీయ డాక్టర్లు 26.5 శాతం. అంటే దాదాపు 2.62 లక్షల మంది. ఇతర దేశాల కన్నా భారతీయ డాక్టర్లే అమెరికాకు ఎక్కువగా వెళుతున్నారు. వీరిలో చాలా మంది న్యూ జెర్సీ, ఫ్లోరిడా, న్యూయార్క్ ప్రదేశాలలో సెటిల్ అవుతున్నారు.

అమెరికాలో 34.17 లక్షల మంది నర్సులు రిజిస్టరయ్యారు. వారిలో ఫిలిప్పీనులు 1.41 లక్షల మంది(26%), భారతీయ నర్సులు 32వేల మంది(6%), నైజీరియన్లు 24వేలు(5%) ఉన్నారు. వీరంతా కాలిఫోర్నియా, నెవడా, న్యూజెర్సీ లలో పనిచేస్తున్నారు. ఫిలిప్పీనులు, మెక్సికన్ల తర్వాత మూడో స్థానం భారతీయ నర్సులదే. అమెరికా హెల్త్ కేర్ సిస్టం లో భారతీయులది ప్రాధాన్యత ఉన్న స్థానమే. అమెరికాలో హెల్త్ కేర్ వర్కర్ల కొరత ఉంది. అందుకనే వారు ప్రవాస నిపుణుల మీద ఆధారపడుతున్నారు. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే వారిపైన.

US healthcare

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News