Saturday, November 9, 2024

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద పెరిగిందా?

- Advertisement -
- Advertisement -

స్విస్ అధికారులను వివరాలు కోరిన ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సంపద ఏడాది వ్యవధిలో భారీగా పెరిగి రూ.20,700 కోట్లకు చేరిందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వ అధికారులను కోరినట్లు తెలిపింది. ‘ స్విస్ బ్యాంకుల్లో 2019 ఆఖర్లో రూ.6,625 కోట్లుగా ఉండిన భారతీయుల సంపద 2020 చివరి నాటికి భారీగా పెరిగి రూ.20,700 కోట్లకుచేరినట్లు వార్తలు వచ్చాయి. గత రెండేళ్లుగా తగ్గుముఖం పట్టిన ఈ సంపద తిరిగి పెరిగిందని పేర్కొన్నాయి. అలాగే గత 13 ఏళ్లలో ఈ సారే అత్యధిక డిపాజిట్లు నమోదయ్యాయని తెలిపాయి’ అని ఆర్థిక శాఖ తెలిపింది. అయితే ఈ లెక్కలు స్విస్ నేషనల్ బ్యాంక్‌కు అక్కడి బ్యాంకులు ఇచ్చిన అధికారిక సమాచారమని మీడియా కథనాలు సూచిస్తున్నాయని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. అంతేకానీ నల్లధనానికి సంబంధించిన లెక్కలని ఎక్కడా సంకేతాలు లేవని తెలిపింది. వాస్తవానికి ఖాతాదారుల డిపాజిట్లు 2019 చివరినుంచి భారీగా పడిపోయాయని పేర్కొంది. సంస్థలు జమచేసే సొమ్ము కూడా సగానికి పడిపోయిందని తెలిపింది. అయితే బాండ్లు, సెక్యూరిటీలు సహా ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ల వల్లనే నిధులు భారీగా పెరిగినట్లు తెలిపింది. అలాగే భారత కంపెనీల వ్యాపార లావాదేవీలు పెరగడం, దేశంలోని స్విస్ బ్యాంకు శాఖల డిపాజిట్లు పెరగడం,స్విస్, బ్యాంకలు మధ్య లావాదేవీలు పెరగడం వంటి కారణాల వ్ల కూడా డిపాజిట్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో డిపాజిట్ల పెరుగుదలకు సంబంధించి వాస్తవాలు .. అందుకు గల కారణాలను తెలియజేయాలని స్విస్ అధికారులను కోరినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News