Thursday, December 19, 2024

స్పీకర్ పదవికి పోటీ పడుతున్న కొండికునాల్ సురేశ్

- Advertisement -
- Advertisement -

ఎన్ డిఏ అభ్యర్థిగా బరిలో ఉన్న ఓమ్ బిర్లా

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ పదవికి తొలిసారి పోటీ జరుగబోతున్నది. ఇదివరలో ఈ పోస్ట్ కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలిసారి ప్రతపక్ష అభ్యర్థిగా కొండికునాల్ సురేశ్ పోటీపడుతున్నారు. కాగా ఎన్ డిఏ అభ్యర్థిగా ఓమ్ బిర్లా పోటీపడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 12.00 గంటలకు ముగిసింది.

ప్రతిపక్ష ఇండియా బ్లాక్ తో మోడీ నేతృత్వంలోని ఎన్ డిఏ  ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ విషయంలో ఓ అంగీకారానికి రాలేకపోయింది. దాంతో స్పీకర్ పదవికి పోటీ నెలకొంది.

18వ లోక్ సభ తొలి రోజు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సహా 262 మంది కొత్తగా ఎన్నికయిన ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. కాగా మిగతా 281 మంది కొత్త ఎంపీలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ ఉన్నారు.

స్పీకర్ ఎన్నిక బుధవారం జరుగనున్నది. ఇదిలావుండగా ఇండియా బ్లాక్ కు చెందిన ఎంపీలు పార్లమెంటు లోపల, వెలుపల ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అన్న నినాదాలతో, రాజ్యాంగం ప్రతులను పట్టుకుని నిరసన తెలిపారు.

స్పీకర్ ఎన్నిక జూన్ 26న జరుగనున్నది. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27 న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రక్రియ కొనసాగనున్నది. వచ్చే వారం ఉభయ సభలలో ప్రధాని మోడీ చర్చలపై సమాధానాలు ఇవ్వనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News