Thursday, December 19, 2024

31న ఇండియా కూటమి మెగా ర్యాలీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసన సూచకంగా ఈ నెల 31న మెగా ఢిల్లీ రామ్‌లీలా మైడాన్‌లో మెగా ర్యాలీ నిర్వహించగలమని ‘ఇండియా’ కూటమి ఆదివారం ప్రకటించింది. దేశ రాజధానిసివిల్ లైన్స్ ప్రాంతంలోని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అధికార నివాసంలో సోదాల అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆయనను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 21న అరెస్టు చేసిన విషయం విదితమే.

మద్యం కుంభకోణంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రాగా ఆయన పాత్ర విషయమై ‘సమగ్ర, సుస్థిర దర్యాప్తు’ నిమిత్తం కేజ్రీవాల్‌ను ఈ నెల 28 వరకు ఇడి కస్టడీకి కోర్టు రిమాండ్ చేసింది. ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ ఆదివారం విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ ఈ ర్యాలీ గురించి ప్రకటించారు. ‘ప్రజాస్వామ్యం, దేశం ప్రమాదంలో ఉన్నాయి. దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఇండియా కూటమి పార్టీలు ఈ ‘మహా ర్యాలీ’ నిర్వహిస్తాయి అని ఆప్ నేత గోపాల్ రాయ్ వెల్లడించారు.

‘దేశంలో నియంతృత్వాన్ని అనుసరించడం ద్వారాను, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడం ద్వారాను ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, గౌరవించే ప్రతి వ్యక్తిలోను ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రధాని మోడీ ఒకదాని తరువాత ఒకటిగా ప్రతి ప్రతిపక్ష నేతపైన బోగస్ కేసుల దాఖలుకు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు’ అని గోపాల్ రాయ్ ఆరోపించారు. ‘31న జరిగే ‘మహా ర్యాలీ రాజకీయపరమైనది’ కాదు. కాని దేశ ప్రజాస్వామ్యం పరిరక్షణకు, కేంద్రానికి వ్యతిరేకంగా వాణి వినిపించేందుకు ఇచ్చిన పిలుపు’ అని కాంగ్రెస్ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ చెప్పారు.

అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుపైన, లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలను లక్షం చేసుకొనడంపైన తమ నిరసన వ్యక్తం చేయడానికి ఇండియా కూటమి నాయకులు పలువురు శుక్రవారం ఎన్నికల కమిషన్ (ఇసి)ని కలుసుకున్నారు. ఆ సమావేశంలో ఇండియా కూటమి నేతలు ఇసికి ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రతిపక్షాలను కేంద్ర సంస్థలు లక్షం చేసుకుంటున్న ఇటీవలి ఉదంతాల జాబితాను, ప్రతిపక్షాలకు ‘సమాన అవకాశాలు కల్పించడం లేదనే’ ఆరోపణలను వారు ఆ వినతిపత్రంలో పొందుపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News