Thursday, January 23, 2025

19న ఇండియా కూటమి భేటీ?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ఇండియా తదుపరి సమావేశం ఈ నెల 19న జరుగుతుంది. కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ మధ్య సీట్ల సర్దుబాట్లు, ఆధిపత్య పోరు విషయంపై విభేదాలు పరిష్కారం అయ్యాయి. దీనితో ఇండియా కూటమి సమావేశానికి మార్గం సుగమం అయింది. వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్, ఇతర పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు ఈ సమావేశంలో కీలక విషయాలు కానున్నాయి. పార్టీల నేతల అందుబాటు విషయాన్ని దృస్టిలో పెట్టుకుని ఇప్పటికైతే 19వ తేదీన ఈ సమావేశం ఖరారు అయిందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలలో దెబ్బతింది.

ఒక్క తెలంగాణలోనే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాట్ల విషయంలో కాంగ్రెస్ ఇంతకు ముందటి పట్టు చెల్లుబాటు అవుతుందా? అనేది స్పష్టం కాలేదు. ఎన్నికల ప్రచార దశలో , ప్రత్యేకించి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సీట్ల సర్దుబాట్ల విషయంలో మొండిగా వ్యవహరించిందని, పెద్దన్న పాత్ర వహించిందని , కాంగ్రెస్‌తో కలిసి సాగడం కుదరదని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. అయితే తమ సంప్రదింపులతో పరిస్థితి దారికి వచ్చిందని , ఇండియా తదుపరి సమావేశం ఈ నెల చివరిలోగా జరుగుతుందని, ఇప్పటికీ 19వ తేదీ ఖరారు అయిందని జైరాం రమేష్ తెలిపారు. ఇండియా భేటీ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News