Wednesday, January 22, 2025

తమిళనాడులో ఇండియా కూటమి స్వీప్

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో డిఎంకె 2019 నుంచి ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగిస్తూ వస్తోంది. ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో డిఎంకె దాదాపుగా స్వీప్ చేసింది. అధికార సంకీర్ణం 39 సీట్లలోకి 38 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ సారథ్యం, కూటములను పకడ్బందీగా నిర్వహించడం, 2019 నుంచి రాష్ట్రంలోని అతిపెద్ద సంకీర్ణాన్ని పటిష్ఠం చేయడం ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. డిఎంకె నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు, దళిత వర్గాలు, మైనారిటీ పార్టీలు ఉన్నాయి. ఎన్‌డిఎ వైపు నుంచి ఆధిక్యంలో ఉన్నది పిఎంకె అభ్యర్థి సౌమ్య అన్బుమణి. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె అన్నామలై పరాజయం చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News