Friday, January 24, 2025

ఇండియా కూటమి 2 రోజుల్లో ప్రధానిని ఎన్నుకుంటుంది: జైరామ్ రమేశ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఇండియా నిర్ణయాత్మక తీర్పును పొందుతుందని , 48 గంటల్లోనే ప్రధానిని ఎన్నుకుంటుందని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ గురువారం తెలిపారు. ఇండియా బ్లాక్ గరిష్ఠ సీట్లను పొందగలదని కూడా ఆయన తెలిపారు.

ఏడో దశ లోక్ సభ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఆయన పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ‘ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్క్లూజివ్ అలెయెన్స్(ఇండియా) దిగువ సభలో 272కు పైగా సీట్లు గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు.

ఇండియా ‘జన్బంధన్’ పార్టీలో ప్రజా తీర్పును పొందాక ఎన్ డిఏ పార్టీలు కూడా సంకీర్ణంలో చేరతాయి. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదనేది నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

నితీశ్ కుమార్, ఎన్. చంద్రబాబు నాయుడు వంటి వారిని చేర్చుకుంటారా? అని అడిగినప్పుడు జైరామ్ రమేశ్ ‘‘నితీశ్ కుమార్ పల్టీ కొట్టడంలో(పార్టీలు మార్చడంలో) మాస్టర్’’ అన్నారు. ‘‘ చంద్రబాబు నాయుడు 2019 లో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్నారు. ఇండియా జనబంధన్ ప్రజా తీర్పును పొందాక కేవలం ఇండియా పార్టీలే కాక, ఎన్ డిఏ పార్టీలు కూడా సంకీర్ణంలో చేరొచ్చు’’ అన్నారు.

‘‘సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీలతో కూడిన కాంగ్రెస్ హై కమాండ్ ఇండియా బ్లాక్ లో ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని చేర్చుకోకూడదన్నది నిర్ణయిస్తుంది’’ అని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News