Thursday, December 19, 2024

మేం 295 దాటుతాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 295కి పైగా సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా తాము ఈ అంకెకు చేరుకున్నామని ఆయన స్పష్టం చేశారు. తన నివాసంలో శనివారం ఇండి యా కూటమికి చెందిన అగ్రనాయకులతో సమావేశమైన అనంతరం ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ రెండున్నర గంటల సమావేశమయ్యామని, ఓట్ల లెక్కింపు రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు, తమ పార్టీలకు ఇవ్వాల్సిన ఆదేశాలతోసహా అనేక అంశాల గురించి చర్చించుకున్నామని తెలిపారు. ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనున్నది. ఎగ్జిట్ పోల్స్ ద్వారా తమ సొం త అంచనాలను చెప్పేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, అయితే తాము ప్రజలకు వాస్తవాన్ని వివరిస్తామని ఆయన చెప్పారు. ఇండియా కూటమికి 295 కి పైగా స్థానాలు లభిస్తాయని, తమ నాయకులందరితో మాట్లాడిన తర్వాత ఈ అంచనాకు వచ్చామని ఆయన తెలిపారు.

ఇది ప్రజల సర్వేనని, ఈ సమాచారాన్ని ప్రజలే తమ నాయకులకు ఇచ్చారని ఖర్గే తెలిపారు. ప్రభుత్వ సర్వేలు కూడా ఉన్నాయని, వారి మీడియా మిత్రులు అంకెలను పెంచి తమకు అనుకూలంగా చెప్పుకుంటాయని ఆయన విమర్శించారు. అందుకే వాస్తవాల గురించి ప్రజలకు తాము చెప్పదలచామని ఆయన వివరించారు. ఫామ్ 17సి గురించి కూడా తమ పార్టీల కార్యకర్తలకు ఇండియా కూటమి పార్టీలు ఆదేశాలు ఇచ్చాయని, ఎన్నిక సర్టిఫికెట్ తీసుకునేంత వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావద్దని వారికి చెప్పామని ఖర్గే తెలిపారు. ఒకపక్క ఏడదవ దశ ఎన్నికల కౌంటింగ్ జరగుతుడగా కాంగ్రె స్, సమాజ్‌వాది పార్టీ, సిపిఎం, సిపిఐ, డిఎంకె, ఆప్, ఆర్‌జెడి, శివసేన(యుబిటి), ఎన్‌సిపి(శరద్ పవార్)కి చెందిన సీనియర్ నాయకులు ఖర్గే నివాసంలో శనివారం మధ్యాహ్నం సమావేశమై చర్చ లు జరిపారు. తమ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందున తమ పార్టీ నాయకులు ఈ సమావేశానికి హాజరుకారని టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించారు.

వ్యక్తిగత కారణాల వల్ల పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సమావేశంలో పాల్గొనలేదు. సమావేశానికి హాజరైన నాయకుల్లో శరద్ పవా ర్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అనిల్ దేశా య్, సీతారాం ఏచూరి, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ ఛద్దా, చంప యి సోరెన్, కల్పనా సోరెన్, టిఆర్ బాలు, ఫరూఖ్ అబ్దుల్లా, డి రాజా, ముకేష్ సాసహాని ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్ కూడా హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News